రామాయంపేట : కరోనా వ్యాధి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలని రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితెంద్రగౌడ్ సూచించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఒక్కరు మాస్కు థరించాలని సూచించారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు సైతం కూడా మాస్కులు, శానిటైజర్‌ఒ వినియోగించాలని సూచించారు. లేకుంటే రూ. 1000 నుండి ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గురువారం పలు వ్యాపార సంస్థలు నిబంధనలకు విరుద్దంగా మాస్కులు, శానిటైజర్‌లు వినియోగించని వారికి జరిమానాలు విధించడం జరిగిందన్నారు. అనంతరం లయన్స్‌క్లబ్ ఛైర్మన్ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి సుమారు వందకు పైగా మాస్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్యాల కిషన్, శోభకొండల్‌రెడ్డి , బిల్ కలెక్టర్ అశ్విత ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement