Friday, November 22, 2024

నిరుపేదలకు ప్రభుత్వం అండ..


మనోహరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎంతో ఆసరగా నిలుస్తూ అండగా ఉంటుందని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మనోహరాబాద్‌ మండలం మేజర్‌ గ్రామపంచాయతీ కాళ్ళకల్‌ గ్రామంలోని చైతన్య గార్డెన్‌లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫారెస్టు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీఛైర్మన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, ఎంపిపి పురం నవనీత రవి, సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్కుల మహిపాల్‌రెడ్డిలతో కలిసి కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్‌, కొండాపూర్‌ గ్రామంలో పరిశ్రమల కోసం అసైన్డ్‌ భూములు కోల్పోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. మనోహరాబాద్‌ మండల వ్యాప్తంగా కళ్యాణలక్ష్మీ 52, షాదిముబారక్‌ 5 చెక్కులను పంపిణీ చేశారు. కొండాపూర్‌ గ్రామంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం 191 ఎకరాల అసైన్డ్‌ భూమిని స్వీకరించిందని భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.10 లక్షల 50 వేలు చొప్పున 86 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్‌తో నిరుపేదలకు ఎంతో దోహదపడుతుందని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల కుటుంబాలకే అందుతున్నాయని తెలిపారు. అభివృద్ది లో సంక్షేమ పథకాలలో దేశంలోనే మొదటి సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేశారుఅధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేసిన ప్రతాప్‌రెడ్డి..
ఫారెస్టు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అధికారుల పనితీరు మార్చుకోవాలని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మండలంలో జరిగే ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకు సర్పంచులకు, ఎంపిటిసిలకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రతి కార్యక్రమాలకు ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహించడం ప్రజలకు గొప్పవరమని ప్రతి ఇంటింటికి ప్రభుత్వ పథకాలు చేరవేయ్యడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గఢా అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీఓ శ్యామ్‌ప్రకాష్‌, తహశీల్దార్‌ బిక్షపతి, పిఏసీఎస్‌ ఛైర్మన్‌ మెట్టు బాలకృష్ణరెడ్డి, ఎంపిడిఓ జైపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి విఠల్‌రెడ్డి, మండల తెరాస అధ్యక్షులు పురం మహేష్‌ముదిరాజ్‌, యూత్‌ వింగ్‌ అధ్యక్షులు రాహుల్‌రెడ్డి, జిల్లా నాయకులు భాషబోయిన చంద్రశేఖర్‌, పంజాల బిక్షపతి, కాళ్ళకల్‌ వార్డు సభ్యులు తుమ్మల రాజుయాదవ్‌, ఏశం నాగరాజుయాదవ్‌, వీరబోయిన నరేష్‌ ముదిరాజ్‌, బంటు శ్రీశైలం, నాయకులు పురం సత్యనారాయణ, బోల్లబోయిన ఐలేష్‌యాదవ్‌, పెద్దింటి చంద్రయ్య, దుర్గేష్‌యాదవ్‌, గునుగు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement