మనోహరాబాద్ : మొక్కలు నాటడం గొప్పతనం కాదు.. నాటిన మొక్కలకు నీరు పోసి సంరక్షించడమే గొప్పతనమని పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేస్తున్న పంచాయతీ అధికారులు పెడచెవున పెట్టడమే కాకుండా నిర్లక్ష్యం వహించడంతో లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసి నాటిన మొక్కలకు నీరు పోయ్యకపోవడంతో ఎండిపోయ్యి హరితహారం ఆబాసుపాలయ్యింది. అలాగే ఎక్కడ పడితే అక్కడా చెత్త పెరుకుపోవడంతో గ్రామంలో కంపు కోడుతు దోమలతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న అధికారుల పర్యవేక్షలోపం వల్ల పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ద్య నిర్మాణం అటకెక్కింది. ఈ ఘటన సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం జిల్లాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన కాళ్ళకల్ మేజర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. గత యేడాది జూలై నెలలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా పంచాయతీ నిధులైన దాదాపు రూ.2 లక్షలతో 10 వేల మొక్కలను అప్పటి ఇంచార్జీ సర్పంచ్ కాలీదాస్ ఆధ్వర్యంలో హరితహారం నిర్మాణంలో భాగంగా ఫారెస్టు డెవలఫ్‌మెంట్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ హేమలత, ఎంపిపి పురం నవనీతలు మొక్కలు నాటారు. లక్షకుపైగా పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ట్యాంకర్ ద్వారా నీరు పోయ్యాల్సింది పోయి ట్యాంకర్‌ను మూలాన పడేయ్యడంతో నాటిన మొక్కలు ఎండుమోకంపడుతూ హరితహారం ఆబాసుపాలైయ్యింది. ఇదిలా ఉండగా పంచాయతీ, ఈజీఎస్ నిధులైన దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డంపుయార్డులోకి చెత్తను తరలించాల్సివుండగా తుతూమంత్రంగా గ్రామంలో పూర్తిస్థాయిలో చెత్తను సేకరించడంతో పాటు తడిపోడి చెత్తను వేరు చేసిన దాకలు కనిపించడంలేదు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ దుర్గాందం వెద్దజల్లుతుండడంతో కూళ్లిన చెత్త దర్శనం ఇస్తుంది. దీంతో దోమలు, ఈగలు స్వైర్యావిహారంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. దోమల నివారణ కోసం లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన శానిటేజర్ మిషన్ పంచాయతీ కార్యాలయంలో మూలానపడ్డాయి. అధికారుల నిర్లక్ష్యంపై వార్డు సభ్యులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన మండల స్థాయి అధికారులు పెడచెవున పెడుతున్నారని వాపోతున్నారు.
హరితహారం, పారిశుద్ద్య నిర్మాణం ఆబాసుపాలుపై కలెక్టర్ ఆగ్రహాం..
గ్రామంలో హరితహారం, పారిశుద్ద్య నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యేడాది జూన్ నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గ్రామాన్ని సందర్శించి ఇది గ్రామమా లేక మురికివాడనా అని అధికారులపై మండిపడ్డారు. గత ఏడాదిలో నాటిన మొక్కలు ఎండిపోగా, గ్రామంలో ఎక్కడ చూసిన పారిశుద్ద్య నిర్వహణ లోపాన్ని గమనించిన ఆయన అప్పటి గ్రామ కార్యదర్శి సంతోష్, సర్పంచ్ నత్తి మల్లేష్‌లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ప్రస్తుత పంచాయతీ అధికారులు ఇంకా నిద్రావస్థలో ఉండడంతో కాళ్ళకల్ వెనుకపాటుకు గురవుతుంది.
కలెక్టర్ సారూ.. జార కాళ్ళకల్‌ను సందర్శించరా..
జిల్లా కలెక్టర్ యస్.హరీశ్ సారూ ఒక్కసారి మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కాళ్ళకల్‌ను సందర్శించలని గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల మండలంలోని అభివృద్ధి జరిగిన పలు గ్రామాలను మాత్రమే సందర్శించారని, అందుకు మండల స్థాయి అధికారులు కేవలం అభివృద్ధి జరిగిన గ్రామాలలోకి మాత్రమే కలెక్టర్‌ను తీసుకెళ్లారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. కాళ్ళకల్‌ను కలెక్టర్ హరీశ్ సందర్శిస్తే అధికారుల పనితీరు బయటపడుతుందనే భయంతో జాగ్రత్తపడ్డారని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి అధికారులను గాడిలో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
మొక్కలకు నీరేక్కడ.. పారిశుద్ద్యానికి దారెక్కడా..
Advertisement
తాజా వార్తలు
Advertisement