రామచంద్రాపురం : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున్‌నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ 6 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాలనీ సంక్షేమసంఘంసభ్యులు, కాలనీవాసులు వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పుష్పనగేశ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు తమవంతు సహయ, సహకారాలను అందజేస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలసి ఉండాలని, ఎటువంటి ఉత్సవాలు వచ్చినా సమిష్టిగా అందరూ కలిసి నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. కరోనా మరోసారి విజృంభిస్తోందని, దానిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం అభిషేకాలను చేయడం జరిగిందని, హనుమాన్ చాలిషాను 21 సార్లు పారాయణం చేసినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, అతికొద్ది మంది భక్తుల మధ్యనే వార్షి కోత్సవ వేడుకలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్యయాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, అధ్యక్షుడు వెంకటస్వామి, సత్యనారాయణ, రాజేశం, విఆర్ఎల్ఎన్. మూర్తి, కృష్ణమూర్తి, నర్సింహారెడ్డి, చారీ, అర్చకులు శ్రీవర్ధన్, బ్రహ్మయ్య, మోహన్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ప్రమోదగౌడ్, బాల్‌రెడ్డి, పరమేశ్‌యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement