మెదక్ : ప్రజాసమస్యల పరిష్కారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా మీకోసం నేను ఉన్నాను అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతుండడంతో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు విన్నవించుకుంటున్నారు. శుక్రవారం మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం విజయవంతమైంది. గుడ్‌ప్రైడే సెలవు దినం అయినప్పటికి పాపన్నపేట, మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, హావేళిఘనపూర్ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అక్కడే ఉన్న అధికారులతో సమస్యలను వివరించి పరిష్కరించారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూంలు, భూసమస్యలు, సీసీరోడ్ల నిర్మాణం తదితర సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఫోన్ ద్వారా 56 మంది తమ సమస్యలను వివరించగా 134 మంది ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరాం, పంచాయతీరాజ్, వ్యవసాయ, మెదక్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే..
మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.17 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లబ్దిదారులకు అందజేశారు. మెదక్ పట్టణానికి చెందిన ఉప్పు లక్ష్మీకి రూ.12 వేలు, మండలానికి చెందిన తిమ్మనగర్ గ్రామానికి చెందిన రవి రూ.60 వేలు, చిట్యాల గ్రామానికి చెందిన కాస వెంకట్రాములు రూ.28 వేలు, మంబోజిపల్లికి చెందిన మ్యాకల భూదమ్మ రూ.48 వేలు, రామాయంపేట మండల పరిధిలోని అక్కన్నపేటకు చెందిన రాగి స్వప్నకు రూ.30 వేలు, రాయిలాపూర్ గ్రామానికి చెందిన శ్యామలకు రూ.24,500 చెక్కులను అందజేశారు. నిజాంపేటకు చెందిన చెల్మేడకు చెందిన సంగోళ్ల పోచయ్యకు రూ.25వేలు, కవితకు రూ.25వేలు, పాపన్నపేట మండలం నామాపూర్‌కు చెందిన బాలమ్మకు రూ.20 వేలు, పాపన్నపేటకు చెందిన వెంకటేశంకు రూ.12వేలు, చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లికి చెందిన సుశీలకు రూ.18వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, తెరాస పట్టణ అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి కృష్ణాగౌడ్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, బీమరి కిశోర్, ఆర్.కె.శ్రీనివాస్, సులోచన, తెరాస నాయకులు, మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ రాగి అశోక్, లింగారెడ్డి, సుమన్, ప్రవీణ్, మధుసూధన్‌రావు, ప్రభురెడ్డి, ఏడుపాయల దేవస్థానం కమిటీ మాజీ ఛైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
తెరాస బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే..
హావేళిఘనపూర్ మండల పరిధిలోని జక్కన్నపేటకు చెందిన యశోద గత ఎడాది ఆగస్టు 8వ తేదీన ప్రమాదవశాత్తు చెరువులో జారీపడి మృతి చెందింది. కాగా కొర్రబోయిన యశోద 2019-20 పార్టీ సభ్యత్వం పొంది ఉన్నారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందడంతో మృతురాలి భర్త రాజయ్యకు రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
Advertisement
తాజా వార్తలు
Advertisement