Friday, November 22, 2024

మిషన్ భగీరథ ప్లాంటు అదుర్స్

సిద్దిపేట : నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం మంగళవారం జిల్లాలోని కోమటి బండలో గల మిషన్ భగీరథ ప్లాంటును సందర్శిoచారు. డా.మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏడు రోజుల శిక్షణ లో భాగంగా.. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు హరి ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్లాంటును సందర్శిoచారు.

ఈ కార్య క్రమంలో 17 మంది శిక్షణ అధికారులు, కోర్సు డైరెక్టర్ డా. రావులపాటి మాధవి, కోర్సు కో ఆర్డినేటర్ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, మిషన్ భగీరథ నీటి సరఫరా, నీటి స్వచ్ఛత, అమలు చేయు విధానం, ప్రభుత్వం లక్ష్యం గురించి చీఫ్ ఇంజినీర్ విజయ్ ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ రాజయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ నాగార్జున రావు, వివరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పథకాన్ని బృంద సభ్యులు అదుర్స్ అంటూ కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement