గజ్వేల్ : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మండల కేంద్రమైన మర్కుక్ లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన, విలేజ్ ఫంక్షన్ హాల్ ప్రారంభం, అలాగే సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement