సిద్దిపేటలోని 37వ వార్డు అంబేద్కర్ నగర్లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేసి కాలనీలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను ఎలా సేకరిస్తున్నారని మున్సిపల్ కార్మికురాలిని అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను వేరువేరుగా మున్సిపల్ చెత్తను సేకరించి వాహనాల్లో వేయాలని కాలనీ వాసులకు సూచించారు. మురికి కాలువలో ప్లాస్టిక్, చెత్తాచెదారం, గాజు సీసాలు ఉండడంతో పరిశుభ్రమైన సిద్దిపేట ప్రజలందరి బాధ్యత అని చెత్తాచెదారం, ప్లాస్టిక్, గాజు సీసాలను ఎక్కడపడితే అక్కడ వేయరాదని కాలనీ వాసులకు సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని స్థానిక కౌన్సిలర్ సాకీ లక్ష్మి ఆనంద్ ను ఆదేశించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, నాయకులు రాజనర్సు, తదితరులున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement