పూర్వం నుంచి ప్రతి గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించి వాళ్ళు, ఈ మధ్యకాలంలో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించడం కొత్త ప్రాచుర్యాన్ని సంతరించుకుంది హెచ్ డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామ అంబేద్కర్ యూత్ అధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ను రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కబడ్డీ శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, ఐక్యూ లెవెల్ పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి సీఎం ప్రత్యేక నిధుల ద్వారా 20 లక్షలు.. గ్రామపంచాయతీ నూతన భవనానికి రూ. 20 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement