Tuesday, November 26, 2024

రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణాల్లో రేషన్ షాపులను గురువారం కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జీఎల్ శర్మ పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టర్ ఆఫీస్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా రేషన్ షాప్, అంగన్వాడి సెంటర్, హాస్టల్స్, స్కూళ్లలో బియ్యం నాణ్యతను ఇబ్బందులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జీ ఎల్ శర్మ అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపులు సమయ పాలన పాటించాలని, తప్పకుండా కీ రిజిస్టర్ అమలు చేయాలని లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలన్నారు.

ఫోర్ట్ ఫైడ్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు.. అనంతరం మెదక్ లో ఎంఎల్ఎస్ గోదాంను సందర్శించి బియ్యం నాణ్యతను పరిశీలించారు.. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ శ్రీనివాస్, డీఈవో, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా మెట్రోలజీ అధికారి, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement