Friday, November 22, 2024

Medak – వ‌ర‌ద ముంపులో వ‌న‌దుర్గా – జలదిగ్బంధంలో ఏడుపాయల

అమ్మ‌వారి పాదాల‌ను తాకిన నీళ్లు
ఏడు పాయ‌లుగా వ‌ర‌ద‌ ప్ర‌వాహం
ఉధృతి త‌గ్గిన త‌ర్వాత అమ్మ‌వారి ద‌ర్శ‌న‌భాగ్యం
న‌క్క‌వాగు నుంచి మంజీరాకు పెద్ద ఎత్తున ప్ర‌వాహం
మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌న్న అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:

మెదక్‌లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలతో మూడు రోజులుగా ఆలయాన్ని వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. దీంతో దుర్గామాత ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున‌ వరద ప్ర‌వ‌హిస్తోంది. అమ్మవారి పాదాలను తాకుతూ.. ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట వాన నీరు పరవళ్లు తొక్కుతుంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన చేశారు. పూజల అనంతరం ఆలయాన్ని మూసివేశారు.

వ‌ర‌ద తగ్గిన త‌ర్వాత..

- Advertisement -

రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటుచేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత యథావిథిగా భక్తులకు అమ్మ‌వారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement