Sunday, September 8, 2024

MDK: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్

ఉమ్మడి మెదక్ బ్యూరో, జులై 18 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మెదక్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతు రుణమాఫీపై బ్యాంకు కంట్రోలర్స్ బ్యాంకు మేనేజర్ తో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా, వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు.

సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న45వేల 882 మంది రైతుల241.82 కోట్ల రూపాయల రుణాల సోమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేస్తుందని, సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితాతో లీడ్ బ్యాంకు మేనేజర్ బ్యాంకు వారీగా రీకన్సైల్ చేయాలని, లీడ్ బ్యాంక్ మేనేజర్ కు పూర్తి స్థాయిలో బ్యాంకులు సమాచారం అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేస్తుందని, ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సోమ్ము వినియోగంపై, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజు రిపోర్టును అధికారులు అందజేయాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -

వ్యవసాయ శాఖ తరపున సీనియర్ అధికారిని జిల్లాలో రుణమాఫీ గురించి వివరాలు అధికారిగా కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము సాఫీగా రైతులకు చేరేలా చూడాలని, ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధిత వచ్చే ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ ఎల్ డి ఎం, నరసింహమూర్తి, బ్యాంకు కంట్రోలర్స్ బ్యాంక్ మేనేజర్లు కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement