Saturday, November 23, 2024

MDK: వాకింగ్, యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. ఎస్పీ చెన్నూరి రూపేష్

సంగారెడ్డి, జూన్ 29 (ప్రభ న్యూస్): జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఆర్మూడ్ రిజర్వ్ డియస్పి నరేందర్ ఆద్వర్యంలో రాజశేఖర్ రెడ్డి, రామ రావ్, హన్మి రెడ్డి ఆర్.ఐ.లు పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు ఆర్మూడ్ రిజర్వ్ పోలీసులకు, ట్రాఫిక్ సిబ్బందికి, హోంగార్డ్ సిబ్బందితో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, రోజువారీ విధులలో భాగంగా మెళకువలు నేర్చుకోవడం, డ్రిల్స్ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందన్నారు.

ప్రతి రోజూ వ్యాయామం ఆరోగ్యానికి శ్రేయస్కరమ‌ని సిబ్బంది, అధికారులు ప్రతి రోజూ వ్యాయామం చేయాలన్నారు. శారీరకంగా శక్తి సామర్థ్యాలతో ఉన్నప్పుడే తమ విధులు సక్రమంగా నిర్వహించగలమని, ప్రతి ఒక్కరికీ ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు. సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ పరేడ్ నందు అధికారులకు విన్నవించుకోవడానికి వీలుంటుందని, పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, జిల్లాకు, తెలంగాణ పోలీసు శాఖకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement