తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు. ఆగష్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్ వో తల్లి పాల వారోత్సవాన్ని జరుపుతుందన్నారు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement