Friday, November 22, 2024

ఖరీఫ్‌ సాగు ప్రారంభం.. అన్నదాతలకు ఆదిలోనే ఆర్థిక సహాయం

వర్షాలు ఆశాజనకంగా కురువనప్పటికీ రైతన్నలు ఖరీఫ్‌ సీజన్‌ను ప్రారంభించారు. నారుమళ్లు వేసి నాట్లు వేసే సీజన్‌ ప్రారంభమైంది. నీరు పుష్కలంగా ఉన్న కొంతమంది రైతులు బోరు బావుల వద్ద రోహిణీ కార్తెలో వేసిన నారుమళ్లను భూమి చదును చేసి నాట్లు ప్రారంభించారు. పంటల సాగు పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే ఆర్థిక సహాయం అందజేసింది. ఆరు నెలలకు ఎకరాకు 5వేల చొప్పున పెట్టుబడుల కోసం రైతు ఖాతాలో జమ చేశారు. ఖరీఫ్‌ సాగు ప్రారంభదశలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలు రైతు సంఘాల ప్రతినిధులు అభినందించారు. ట్రాక్టర్ల సాయంతో బురద దుక్కులు దున్నినా కాడేడ్ల సహాయంతో భూమి చదును చేసి నాట్లు వేస్తున్నారు. బోర్ల వద్ద నీరు పుష్కలంగా లేని కొంత మంది రైతులు వారం రోజులుగా నారుమళ్లు వేస్తున్నారు. అడవి పందుల బెడద నుండి నారుమళ్లను కాపాడుకోవడానికి రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది రైతులు మొక్కజొన్న పంటలు వేయకుండా అడవి పందుల బారి పంటలు కాపాడుకోవడానికి పత్తి పంటలు సాగుచేస్తున్నారు.

మొక్కజొన్న పంటలైనా పత్తిపంట సాగు చేసినా మొలకెత్తే వరకు రైతులు రాత్రి వేళలో కాపలా ఉండక తప్పడం లేదు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సంతవ్సరానికి ఒక్కో రైతు కుటుంబానికి ఆరు వేల చొప్పున పంటల సాగు కోసం ఆర్థిక సహాయం అందజేస్తోంది. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని పలువురు అభినందిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడుల సహాయం సన్నకారు చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. రైతుల పంటల సాగు కోసం వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందజేయాలని అలాగే వితనాలను సైతం సబ్సిడిపై అందజేయాలని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. సబ్సిడిని తొలగించడం వల్ల కొంత మేరకు రైతులకు ఆటంకం ఏర్పడిందని రైతులు విచారం వ్యక్తం చేశారు. రైతన్నలు విత్తనాలను కొనగోలు చేస్తున్న సమయంలో సీడ్స్‌షాప్‌లపై దృష్టి పెట్టవలసిన అవసరం వ్యవసాయ శాఖ అధికారులపై ఎంతైనా ఉంది. అలాగే విత్తనాల బస్తాలపై లాట్‌ నెంబర్‌ బ్యాచ్‌ నెంబర్‌ లేకుండా విత్తనాలు సరఫరా చేస్తే చర్యలు తీసుకొని షాప్‌లను రద్దు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement