Tuesday, November 26, 2024

కార్మిక లోకం మేడే వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు, ప్రభ న్యూస్ : రానున్న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే తలపెట్టిన కార్మికుల బహిరంగ సభను విజయవంతం చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్మిక లోకాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ వీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కార్మికులకు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడం జరిగిందన్నారు. కార్మికులు ఓటీలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలు నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులకు మెరుగైన వేతనాలు అందిస్తున్నట్లు జీఎంఆర్ తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సైతం ఆరు లక్షల రూపాయల ప్రమాద భీమా అందిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల్లో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలను చేసిన ఘనత వీఆర్ఎస్ కేవీ దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో మేడే వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ జిల్లా అధ్యక్షులు శివశంకరరావు, ఈఎస్ఐ బోర్డు మెంబర్ రమణారెడ్డి వివిధ పరిశ్రమల ప్రతినిధులు వెంకట్రావు మాధవరావు భాస్కర్ రెడ్డి అర్జున్ సతీష్ శివ బాల్రెడ్డి పద్మ భూపాల్ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement