Wednesday, November 20, 2024

కాళేశ్వర జలాలతో చెరువులు.. కుంటలకి జల కళ ..

హవేళిఘణపూర్‌ మండలంలో కాళేశ్వరం జలాలు కూచన్‌పల్లి నుండి నిజాంసాగర్‌ డ్యామ్‌కు ప్రవాహం మొదలు కాగానే ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద పక్కనుండి వెళ్లే కాళేశ్వర జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం జల కళ సీఎం కేసీఆర్‌ వల్ల నిజమైందని.. రైతే రాజుని చేయడానికి ఎంత దూరంలో లేమని కొనియాడారు. రైతుకు భరోసాగా కాళేశ్వర జలాలు సాక్ష్యమని ఆయన తెలిపారు. అపర భగీరథుడు మన సీఎం చేసిన ప్రయత్నం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదని తెలిపారు. కృషితో పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుందని ఆయన అన్నారు. కాళేశ్వరం నుండి మొదలై కొండపోచమ్మసాగర్‌ నుండి ఆ తర్వాత హల్దివాగు కూచన్‌పల్లి చెక్‌డ్యామ్‌ మీదుగా నిజాంసాగర్‌ డ్యామ్‌కు నీళ్లు వెళ్లతాయని తెలిపారు. కాళేశ్వర నుండి 1600 క్యూసెక్కుల వాటర్‌ను వదిలి పెట్టామన్నారు. 250 మీటర్ల వెడల్పుతోటి కూచన్‌పల్లి వాగు మీదుగా నిజాంసాగర్‌ డ్యాంకు వాటర్‌ వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగానరేందర్‌, ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు దేవాగౌడ్‌, మైపాల్‌రెడిడ, యామిరెడ్డి, సుధాకర్‌, లక్ష్మీనారాయణ, ఎంపిటిసిలు రాజయ్య, కిషన్‌గౌడ్‌, సర్పంచ్‌ బయ్యన్న, సిద్దిరాంరెడ్డి, పాపన్నపేట మండలం వివిధ గ్రామాల రైతులు మండల రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement