Saturday, November 23, 2024

‘కేసీఆర్’ కి ‘హరీశ్ రావు’ కృతజ్ఞతలు..

సిద్దిపేట : గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి హరీశ్ రావు. ఇందులో భాగంగా కోడకండ్ల వద్ద కాలువను పరిశీలించారు. నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కూడవెళ్లి వాగుకు నీటి విడుదలపై సీఎం కేసీఆర్‌తో హరీశ్‌ రావు ఫోన్‌లో మాట్లాడారు. పంటలను కాపాడేందుకు కాళేశ్వరం కాలువ నుంచి వాగుకు నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో వెంటనే వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలోని కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. తక్షణమే కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కూడవెళ్లి వాగు ద్వారా గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో సుమారు 11 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement