మెదక్ : జూనియర్ కళాశాలలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్‌చౌదరి డిమాండ్ చేశారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ కార్యదర్శి ఒమర్ జలీల్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో జరుగబోయే జాతీయస్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వెంటనే కళాశాలలు ప్రారంభించాలని, లాక్‌డౌన్, కళాశాలల మూసివేత వలన తెలంగాణలో ప్రైవేట్ యాజమాన్యాలు, అధ్యాపకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిస్థితిని గమనించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కళాశాలలు వెంటనే తిరిగి ప్రారంభించాలని వారు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement