Friday, November 22, 2024

MDK: మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం సిగ్గుచేటు.. సీఎం క్షమాపణ చెప్పాలి..

మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్
మెదక్ లో సీఎం, డిప్యూటీ సీఎం దిష్టి బొమ్మ దగ్దం

మెదక్ ప్రతినిధి, ప్రభన్యూస్ : నిండు శాసనసభలో తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే విధంగా మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం మెదక్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రోడ్డు పై బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల ఆందోళనతో రోడ్డు పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం అహంకార ధోరణి వైఖరి మానుకోవాలన్నారు. సభలో సమస్యల పై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డమీద కృష్ణ గౌడ్, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, చింతల నర్సింలు, జయరాజ్, ప్రభురెడ్డి, మధు, కిషన్, ఏనుగుల రాజు, గోవిందు, అంకం చంద్రకళ, మహమ్మద్ గౌస్, అజ్గర్ అలీ, బాలరాజ్, యాదగిరి, లక్ష్మీనారాయణ, మహమ్మద్ ఇస్మాయిల్, ఫజల్, రుక్మాచారి, శ్రీను, నరేందర్ గౌడ్, ముకుందం, తిరుపతి, హుస్సేన్, గోపాల్, సంతోష్, సంఘ శ్రీకాంత్, గంజి నవీన్, కిరణ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి
సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
సంగారెడ్డి, ఆగస్టు 1 (ప్రభ న్యూస్) : మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు.

రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే మహిళ శాసనసభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని లేదంటే నిరసనలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, శ్రవణ్ రెడ్డి, మ్యకం విటల్, గోవర్ధన్ రెడ్డి, విఠల్, రుక్ముద్దీన్, అజీమ్, చింటూ, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement