జిన్నారం : స్వాతంత్ర్యవజ్రోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవాలని తెరాస రాష్ట్ర నాయకులు, చిట్కూల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజు జాతీయ పతాకాలు చిట్కుల్ గ్రామంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. స్వాతంత్ర్య సంపాదనకు గాంధీ నెహ్రూ వంటి నేతల కృషిని స్ఫురించుకుంటూ ఈ వజ్రా ఉత్సవ వేడుకల్లో ముందుకు సాగాలని తెలిపారు. ఈ నెల 8 తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని స్వాతంత్ర్య స్ఫూర్తిని పొందే విధంగా అహ్లాదకరంగా జరుపుకోవాలన్నారు. ఈ వజ్రోత్సవ వేడుకల్లో ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు, క్రీడలు నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ వజ్రోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఇందులో యువకులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హారిశంకర్,ఎపీఎం శ్రీనివాస్,ఈవో కవిత , ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ,వెంకటేశ్,ఆంజనేయులు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, డ్వాక్రా మహిళలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement