Monday, November 18, 2024

MDK: అక్రమ ల్యాండ్ గ్రాబ్బింగ్ ముఠా గుట్టు రట్టు

-పోలీసుల అదుపులో 10 మంది నిందితులు
-వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి, జూన్ 05 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసులు అక్రమ లాండ్ గ్రాబ్బింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఆ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. మే 26న హైదరాబాద్ చెందిన పెండ్యాల హరినాద్ బాబు సర్వే నెం.198, 251లలో గత భూమిలోకి అక్రమంగా ప్రవేశించారన్నరు.

అత్రియ స్మార్ట్ రియల్ కంపెనీ కార్మికులైన గణపతి రాజు శ్రావణ్ వర్మ అలియాస్ శ్రవణ్, గట్టుముక్కల భరత్ వర్మ, పి.అశోక్ రెడ్డి, పాషా, వారి స్నేహితుడైన అఖిల్, 10మంది కిరాయి మనుషులను తీసుకెళ్లి ఆ భూమిలో తళ్వార్ కత్తులు, కట్టెలతో అక్కడున్న వారిని, పనిచేస్తున్న వారిపై దౌర్జన్యం చేస్తూ బూతుమాటలు తిడుతూ దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. చంపుతామని బెదిరించి, అక్కడి నుంచి వెళ్లగొట్టి జేసీబీల సహాయంతో భూమి చుట్టూ వేసిన సుమారు 800 ఫెన్సింగ్ కడ్డీలను విరగ్గొట్టి డ్యామేజ్ చేశారన్నారు.

గాడిపర్తి రవీందర్ బాబు, కూకట్ పల్లి, హైదరాబాద్ మునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన మునిపిల్లి పోలీసులు కేసు పూర్వపరాలను విచారించి ఎస్పీ చెన్నూరి రూపేష్, మునిపల్లి ఎస్ఐ సురేష్, సిబ్బంది అందరూ కలిసి చాకచక్యంగా వ్యవహరించి కిరాయి మనుషులను, యం.ఆర్.యస్ వర్మ దగ్గర పనిచేస్తున్న గణపతి రాజు శ్రావణ్ వర్మ అలియాస్ శ్రవణ్ లు కిరాయి మనుషులను ఏర్పాటు చేసిన ఆనంద రావు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమంచి ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడినా, ల్యాండ్ యజమానులకు బెదిరించినా, కిరాయి మనుషులతో లాండ్ లోకి ఆక్రమంగా ప్రవేశించినా దౌర్జన్యం చేసి ప్రజాశాంతికి భంగం కలిగంచినా చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేసి, పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement