సంగారెడ్డి : పోచంపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ వ్యవసాయం పని చేస్తుండగా ఆరు 6 నెలల క్రితం తన కుడి పాదంలో ఒక బండ గుచ్చుకుంది. వెంటనే సుధాకర్ ఆస్పత్రిలో ఆ బండను తీసి వేయించుకున్నాడు. ఆ గాయం పూర్తిగా మానిపోయిన తరువాత కూడా… అప్పుడప్పుడు తనకి పాదం నొప్పి వేసేది. గత రెండు నెలలుగా నొప్పి ఎక్కువ కావడంతో నడవడానికి ఇబ్బంది అవ్వడంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్.. సంగారెడ్డిలో ఆర్థోపెడిక్ ఓపికి వచ్చాడు. ఎక్స్రే తీసి చూడగా ఎముకలలో ఫారెన్ బాడీ ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేసి వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. నిన్న పాదానికి శస్త్ర చికిత్స చేయగా ఐదు రాయి ముక్కలు వెలికి తీశారు. ప్రస్తుతం పేషంట్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్లో లో ఆర్థోపెడిక్ విభాగం, అనస్థీషియా డాక్టర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement