Tuesday, November 26, 2024

హైద‌రాబాద్ టు మెద‌క్‌.. 23నుంచి ప‌రుగులు పెట్ట‌నున్న‌ ప్యాసెంజ‌ర్ రైలు

మెదక్ ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కి, ప‌రుగులు పెట్టే స‌మ‌యం వ‌చ్చింది. హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌ నుంచి అక్కన్నపేట మీదుగా మెదక్‌ వరకు ప్యాసింజర్‌ రైలును నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కొత్త రైలును ఈ నెల 23న రైల్వేశాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దాన్వే ప్రారంభించనున్నారు.

అక్కన్నపేట-మెదక్‌ మధ్య 17 కి.మీ. మేర కొత్త రైలుమార్గం నిర్మించే ప్రాజెక్టు పదేళ్ల క్రితం మంజూరైంది. భూసేకరణ, ఇతర కారణాలతో ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమైంది. 2012-13లో మంజూరు చేసినప్పుడు అంచనా వ్యయం రూ.117.72 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఖర్చు ఆలస్యం కారణంగా దాదాపు రెండున్నర రెట్లకు పెరిగింది. కొద్దికాలం క్రితం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మెదక్‌- అక్కన్నపేట రైల్వే లైన్‌, రైల్వే స్టేషన్ల పనుల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.50 కోట్లు మంజూరు చేయించారు. తద్వారా ఈ పనులు మరింత వేగంగా జరిగాయి. ఈనెవ 23 నుంచి సేవలు ప్రారంభం కావటంతో… ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement