Sunday, November 10, 2024

Sangareddy: అర్ధరాత్రి భారీ వర్షం… ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం

సంగారెడ్డి, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : సంగారెడ్డి అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో సంగారెడ్డి టౌన్ అతలాకుతలమైంది. ఏకధాటిగా రెండు గంటలపాటు కురిసిన వర్షం మరోసారి జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన 10సెం. మీ. భారీ వర్షానికి అతలాకుతలమైంది సంగారెడ్డి టౌన్.

రెండు గంటలు ఏకధాటిగా కురిసిన వర్షానికి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాలు. దీంతో విద్యుత్ సరఫరా.. రాత్రంతా నిలిచిపోయింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై వరదలో బస్సు చిక్కుకుపోగా.. ఓ బైక్ కొట్టుకుపోయింది.

బస్సు నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడ్డారు ప్రయాణికులు. వరదతో కొట్టుకుపోతున్న బైక్ ను కాపాడుకోవడానికి ఆపసోపాలు పడ్డారు యువకులు. అపార్ట్ మెంట్లలోకి నీరు చేరడంతో మోటార్లు పెట్టి బయటికి తీసారు. గత సెప్టెంబర్ మొదటివారంలోనూ భారీ వర్షాలతో నీటమునిగిన సంగారెడ్డి.. మరోసారి నీట మునిగింది. రోడ్డుపై భారీగా వరద రావడంతో ఇసుకమేటలు పేరుకుపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement