Sunday, November 24, 2024

MDK: ఐదు రోజుల్లోనే సింగూరుకు భారీ వరద నీరు…

పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకునేలా ప్రాజెక్ట్
ఏ క్షణమైన గేట్లు ఎత్తేందుకు అధికారుల సిద్ధం
24 టీఎంసీలకు చేరుకున్న ప్రాజెక్ట్
ప్రస్తుతం కొనసాగుతున్న44,194 క్యూసెక్కుల ఇన్ ప్లో
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన


జోగిపేట, ప్రభ న్యూస్: ఉమ్మడి పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఐదు రోజుల్లోనే ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఇలాగే వరద కొనసాగితే ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం చేరుకోనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 44,194 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది.

ప్రస్తుతం ప్రాజెక్టులో 24.423 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉంది. ఇలాగే వరద కొనసాగితే ఈరోజు సాయంత్రంలోగా ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి సూచించారు. పశు కాపరులు, మత్స్యకారులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement