Sunday, November 24, 2024

Singur : సింగూరుకు భారీ వరద.. జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం

సంగారెడ్డి, సెప్టెంబర్ 5 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా, 3,186 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. సింగూరు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు కాగా, ఇప్పుడు 28.22 టీఎంసీలు నీల్వ ఉన్నది.

నీటి నిల్వ 523.60 మీటర్లకు గాను 523.2 మీటర్ల వద్ద నీరు ఉంది. భారీ వరద నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులో జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. జెన్‌కో గేట్ల ద్వారా 2700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, గేట్లు ఎత్తివేయడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement