Friday, November 22, 2024

హరీష్ రావుకు వినతి..

చేగుంట : మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆర్థికమంత్రి హరీష్‌రావుకు వివరించినట్లు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఇబ్రహీంపూర్‌ సొసైటీ మాజీ ఛైర్మన్‌ నారాయణరెడ్డి తెలిపారు. ప్రధానంగా రబీ సీజన్‌లో చేగుంట మండలంలో రెట్టింపు స్థాయిలో వరిసాగు చేశారని వివరించారు. ఇబ్రహీంపూర్‌ కొత్త సొసైటీ ఏర్పడిన సమయంలో తాను ఛైర్మన్‌గా ఎంపికై సొసైటీ ద్వారా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గతంలో ఉన్న మక్కరాజ్‌పేట వ్యవసాయ సహకార పరపతి సంఘంను కొత్తగా ఏర్పడిన ఇబ్రహీంపూర్‌ సహకార సంఘంలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఇబ్రహీంపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అతిపెద్ద సొసైటీగా మారిందని సుమారు 17 గ్రామాలు ఉన్నాయని మంత్రి హరీష్‌రావుకు నారాయణరెడ్డి వివరించారు. ఐకెపి సెంటర్లను అధిగమించి ఇబ్రహీంపూర్‌ సొసైటీ ద్వారా ఎక్కువశాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపూర్‌ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని తానే స్వయంగా నిర్మించానని, బిల్లులో జాప్యం జరుగుతుందని వివరించారు. రైతు వేదిక భవనం ప్రారంభబోత్సవానికి తేదీ నిర్ణయించి సమయాన్ని కేటాయించాలని కోరినట్లు నారాయణరెడ్డి తెలిపారు. మండలంలో నెలకొన్న ప్రాంతాల వారి సమస్యలను మంత్రికి వివరించానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement