Tuesday, November 26, 2024

సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జీఎంఆర్‌

పటాన్ చెరు : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మినీ ఇండియా గా పేరుందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని తాసిల్దార్, మండల ప్రజా పరిషత్, జీహెచ్ఎంసీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణల కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీఎంఆర్ మాట్లాడుతూ.. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అత్యధిక పరిశ్రమలు కలిగిన పటాన్ చెరులో కార్మికులకు ఆధునిక వైద్యం అందించేందుకు గాను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసిందని, అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఇస్ ఆఫ్ డూయింగ్ విధానం మూలంగా నియోజకవర్గ పరిధిలో కాలుష్య రహిత నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement