సదాశివపేట : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. ఆదివారం జాతీయచేనేత దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో అధ్యక్షుడు చింత గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడారు.. అంతకుముందు చేనేత కార్మికుల రాట్నాన్ని దారాన్ని చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజుకు చేనేత కార్మికుల బ్రతుకులు దుర్భరంగా మారాయని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి నడ్డి విరుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వలె చేనేత కార్మికుల కూడా ఐదు లక్షల బీమా పథకాన్ని ప్రకటించడం జరుగుతుందని, వృత్తిలో ఉన్న వారందరికీ ఆరోగ్య బీమా తదితర పెన్షన్ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇల్లు లేని అర్హులైన పేద చేనేత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందచేయడం జరుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement