మెదక్ : కరోనా మహమ్మారి గత యేడాది కాలం నుండి ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మొన్నటి అక్టోబర్ నుండి తగ్గుముఖం పట్టాయనుకున్న కేసులు 2021 ఫిబ్రవరి, మార్చిలో కేసులు అమాంతం పెరిగిపోవడంతో దానికి సెకండ్‌వేవ్‌గా నామకరణం చేశారు. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ దిశగా రాత్రి కర్ఫూలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఐదారు రాష్ట్రాల్లోనే కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ కొనసాగుతుంది. వాటిని పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతా తీవ్రతంగా లేదు. మార్చి నెలాఖరులోనే మనం వెయికి పైగా కేసులు చూస్తున్నాం. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మార్గదర్శకాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ సిబ్బంది, వైద్య బృందం ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకొని అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాల్సిందిగా పలు సూచనలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం రెండుమూడు జీవోలు కూడా తెచ్చింది. మాస్కులు దరించకపోతే 2వేల ఫైన్, సెకండ్‌టైమ్ జైలు అనే జీవోలు అమలులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో మార్చి నెలలో జిల్లాలో 11 నుండి 18 కేసులు వెలుగు చూశాయి. అందులో ముఖ్యంగా మెదక్ జిల్లా కేంద్రంలో కేసులు అంతగా లేవు. ఏవైనా తూప్రాన్, నర్సాపూర్, పాపన్నపేట, ఆయా మండలాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతోపాటు మెదక్ జిల్లాకు 30వేల వ్యాక్సినేషన్ డోసులు వస్తే ఇప్పటి వరకు 25వేల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలియజేశారు. మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్ అంతా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారని వ్యాక్సినేషన్ జిల్లాలో వేగవంతం చేశామన్నారు. గత నెలలో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చి ఇప్పుడు స్వచ్చందంగా తీసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకుంటే కరోనా మహమ్మారి నుండి బయటపడవచ్చని అన్నారు. 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎవరైనా స్వచ్చందంగా వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చని, మెదక్ జిల్లాలో కరోనా అదుపులో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం కష్టపడి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి ప్రజలకు అనుగుణంగా మా జిల్లా వైద్య సిబ్బంది మెరుగైన సేవలు చేస్తున్నామని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నీ జిల్లాల కన్నా మెదక్ జిల్లాలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయడం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందని ఆయన కొనియాడారు. వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఆయన తెలియజేశారు. ప్రజలు బయపడకుండా ఎంతమంది వచ్చినా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement