Friday, November 15, 2024

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం..

పటాన్‌చెరు : హైదరాబాద్‌ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో 2021-22 విద్యాసంవత్సరం నుంచి బీ.ఆఎ్టోమెట్రీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆఫ్టో మెట్రీ) కోర్సును ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ సౌజన్యంతో ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. నాలుగేళ్లు నిడివి గల ఈ కోర్సులో విద్యార్థులు రెండేళ్లు తమ ప్రాంగణంలోనే విద్యను అభ్యసిస్తారని, మరో రెండేళ్లు ఎల్వీ ప్రసాద్‌లో వృత్తి నైెపుణ్య శిక్షణ పొందుతారని వివరించారు. కంటి వ్యాధులు, దృశ్య రుగ్మతల పరీక్ష, రోగ నిర్దారణ, చికిత్స, నిర్వహణల శాస్త్రం ఆఎ్టోమెట్రీ అని, ఇది దృష్టిని మెరుగుపరడానికి కంటి పరికరాలపై (లెన్సులు, కళ్ళజోడు) ప్రయోగాలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులను సమర్ధ నిపుణులుగా మార్చడానికి, ఆప్టీషియన్‌, ఆఎ్టోమెట్రిస్ట్‌, ఆఎ్టాల్మిక్‌ అసిస్టెంట్లుగా ఆరోగ్య సంరక్షణ బృందంలో పని చేయడానికి ఈ కోర్సు వీలు కల్పిస్తుందని ప్రొఫెసర్‌ రామరావు పేర్కొన్నారు. రోగికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి కృత్రిమ మేథ (ఏఐ), లోతైన అభ్యాసం (డీప్‌ లెర్నింగ్‌) వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించడంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఇంటర్మీడియెట్‌ లేదా ప్లస్‌2ను గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ బయాలజీ వంటి సబ్జెక్టులలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులన్నారు. వార్షిక రుసుము, ప్రవేశ పరీక్ష, ఇతర వివరాల కోసం 08455- 221395/ 372 లను సంప్రదించాలని, లేదా వెబ్‌సైన్‌ను సందర్శించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement