పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా పదోన్నతిపై వెళ్లిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్ స్థానంలో కరీంనగర్ జిల్లాలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా పనిచేసి సిద్దిపేట జిల్లాకు బదిలీపై నియమించబడిన గరీమా అగర్వాల్ గురువారం సమికృత జిల్లా కార్యలయ సముదాయంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన కలెక్టర్ గరీమా అగర్వాల్ శిక్షణ కలెక్టర్ గా యాదాద్రి భువనగిరి జిల్లాలో అనంతరం రెండు సంవత్సరాలు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గా కరీంనగర్ జిల్లాలో రెండు సంవత్సరాలు విధులు నిర్వహించి దళిత బంధు పథకం, పోషక అభియాన్ కార్యక్రమం అమలు, నేషనల్ పంచాయతీ అవార్డు రావడానికి కృషి చేసి అందరి మన్ననలు పొందారు.