సంగారెడ్డి : గత సంవత్సర కాలం నుండి సంగారెడ్డి జిల్లా, ప్రక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాలో గల మూతబడిన పరిశ్రమలు, వ్యవసాయ భూముల వద్ద ఉండే ట్రాన్స్ ఫార్మర్లు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో గల పారిశ్రామిక ప్రాంతాలైన ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్, పటాన్ చెరు పోలీస్ స్టేషన్, BDL భానూర్ పోలీస్ స్టేషన్, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడలలో ఉన్న లాక్ అవుట్ అయిన ఫ్యాక్టరీలలోని ట్రాన్స్ ఫార్మర్లు, జహీరాబాద్ డివిజన్ లో గల కోహీర్, జహీరాబాదు రూరల్, చిరాగ్ పల్లి, ఝరాసంగం, రాయికోడ్, హద్నూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల వ్యవసాయ భూముల వద్ద గల ట్రాన్స్ ఫార్మర్లను ఎంచుకొని అందులో ఉన్న కాపర్ కాయిల్స్ లను ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకుని పోవుచున్నారని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ అన్నారు. సుమారుగా ఈ జిల్లాలో గత సంవత్సర కాలం నుండి పైన తెలిపిన పోలీస్ స్టేషన్ ల నందు 26 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఇట్టి నేరాలు మళ్ళీ జిల్లాలో జరగకుండా ఉండాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నేను ఈ నేరాలు జరుగుచున్న ప్రాంతంలో ఉన్న మా పోలీసు అధికారులకు నైటు పెట్రోలింగ్ ను ముమ్మరం చేయమని మరియు రాత్రి సమయములో వాహనాలు తనిఖీ చేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే తేదీ 19/20-07-2022 రాత్రి సురేందర్ రెడ్డి, IDA బొల్లారం ఇన్ స్పెక్టర్, జిన్నారం CI వేణు కుమార్, గుమ్మడిదల SI విజయక్రిష్ణ, వారి సిబ్బంది కలసి గడ్డపోతారం నుండి జిన్నారం వచ్చే దారిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి దాటినాక ఒక Ashok Leyland మినీ ట్రాలీ, రెండు బజాజ్ ఆటోలలో ఏడుగురు వ్యక్తులు అక్కడికి రాగా అట్టి వాహనాలను మా సిబ్బంది తనిఖీ చేయగా Ashok Leyland ట్రాలీలో ఒక ట్రాన్స్ ఫార్మర్ కు సంబంధించిన కాపర్ కాయిల్స్ ఉన్నవని గమనించి, వారిని విచారించారు. వారు ఏడుగురు వాళ్ళతో పాటుగా ఇంకా 12 మంది వ్యక్తులు రెండు ముఠాలుగా ఏర్పడి సుమారుగా ఈ జిల్లాలో జరిగినటువంటి ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు, వికారాబాదు జిల్లాలో పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాలు తామే చేసినామని ఇట్టి దొంగతనాలు చేసే క్రమంలో ఎవరైనా వారిని అడ్డగిస్తే అలాంటి వారిపై వారి వద్దగల గొడ్డళ్ళతో దాడి చేసి వారిని గాయపరచి, అవసరమైతే వారిని చంపైనా వారి యొక్క దొంగసొత్తును ఎత్తుకోని వెళ్తామని తెలిపినారు. ఇలా దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను జహీరాబాద్ లో, పటాన్ చెరులో, బల్కంపేట హైదరాబాదులో అమ్ముకుంటామని తెలిపి ఈరోజు కూడా అట్లా దొంగిలించిన కాపర్ కాయిల్స్ ను హైదరాబాదులో అమ్ముకుందామని వెళ్ళుచుండగా మీరు పట్టుకున్నారని నిందితులు తెలిపారు. వారి వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించే పని ముట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇట్టి దొంగతనం కేసులలో వీరి యొక్క స్టేట్ మెంట్ ను బట్టి ఇంకా 12మంది నేరస్తులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. త్వరలోనే వారిని కూడా పట్టుకొని ఈ కేసులకు సంబంధించిన సొత్తును రికవరీ చేసి వారిని కూడా న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని ఈ కేసులను చాకచక్యంగా చేదించిన పటాన్ చెరు DSP భీమ్ రెడ్డి, CI లు సురేందర్ రెడ్డి, IDA బొల్లారం పి.యస్, వేణుకుమార్, CI జిన్నారం, విజయక్రిష్ణ SI గుమ్మడిదల PS మరియు వారికి సహకరించిన వారి సిబ్బంది అందరిని. జిల్లా పోలీసు ఉన్నతాధికారి రమణకుమార్ అభినందించనైనది.
Advertisement
తాజా వార్తలు
Advertisement