చేగుంట, (ప్రభన్యూస్) : బాల కార్మిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ప్రకటనలు ప్రచారం చేసినా ఆచరణలో మాత్రం శూన్యం. బాల కార్మిక నిర్మూలన కోసం చట్టాలు రూపొందించినా కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు బాల కార్మిక దినోత్సవం క్వారీలలో, ఇట బట్టీలు, హోటల్స్, ఫౌల్ట్రీఫారాలలో, వ్యాపార రంగాల్లో, చిన్నచిన్న పరిశ్రమల్లో బాల కార్మికులు ఎంతో మంది దుర్బరజీవితం గడుపుతున్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమమాపడానికి ఇష్టమైన చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విధితమవుతుంది. మండలాల వారీగా పనిచేసే లేబర్ అధికారులు చేతివాటంతో పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బలపాలు పట్టవలసిన చేతులు బడికి వెళ్లవలసిన గరీబోళ్ల పిల్లలు దీ నావస్థలో దుర్బర జీవితం గడుపుతున్నారు. కడుపునిండా తిండిలేక చిరిగిన బట్టలతో చదువులేక బాల కార్మిక దశలో మగ్గుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో చూస్తే బాల్య దశ పిల్లలు బిక్షాటన చేస్తున్నారు. కార్మిక చట్టాలు అమల్లో ఉన్న ఆచరణలో మాత్రం శూన్యంగానే మిగిలిందన్న ఆరోపణలు కార్మిక సంఘాల నేతలు గుప్పిస్తున్నారు. ప్రపంచ బాల కార్మిక దినోత్సవం సందర్భంగా ప్లెక్సీలు వేసుకోవడం, వాట్సాప్ గ్రూపులో పెట్టడం కొంతమంది ప్రజాప్రతినిధులకు శరమాములైపోయింది. బాల కార్మికుల పట్ల నాయకులు ఉపన్యాసాలు ఇవ్వడం చిత్తశుద్ది లేని కొంత మంది ప్రజాప్రతినిధులు ఓరెత్తినట్లు వ్యవహరించడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్మిక శాఖ అధికారులు బాల కార్మికుల పట్ల బాధ్యతారహితంగానే పనిచేస్తేనే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.