Monday, November 18, 2024

MDK: సింగూర్ కు వరద శుభ సూచకం.. దామోదర రాజనర్సింహ..

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సింగూరు నీటిని విడుదల చేసిన మంత్రి
జోగిపేట, సెప్టెంబర్ 5(ప్రభ న్యూస్) : సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు రావడం శుభ సూచకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సింగూర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరి ప్రాజెక్టు నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ప్రాజెక్ట్ వద్ద 4, 6 నెంబర్లకు సంబంధించిన గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

దీనికి ముందు మంత్రి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితి, తదితర వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అన్నారు. రెండు గేట్లు 1.50 మీటర్ల పైకెత్తి 16,284 క్యూసెక్కుల నీటిని వదిలారు. జెన్ కో ద్వారా 2,822 క్యూసెక్కులు, మొత్తం19,106 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మంత్రి వెంట ప్రాజెక్టు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement