Friday, November 22, 2024

మెదక్ జిల్లాలో కలకలం.. తహసీల్దార్‌పై డీజిల్ పోసిన రైతులు

మెదక్ జిల్లాలో రైతుల తొందరపాటు చర్యతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వారి ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా తహసీల్దార్‌పైనే రైతులు డిజిల్ పోశారు. అనంతరం నిప్పంటిచబోయారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతుకు అందాల్సిన రైతు బీమా అగిపోయిందంటూ రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై డీజిల్ పోశారు. సాధారణంగా రైతులే ఎమ్మార్వో కార్యాలయాల ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంటారు. కానీ, ఈ రైతులు మాత్రం ఎమ్మార్వో పైనే డీజీల్ పోశారు.

మెదక్ జిల్లా చెందిన తాళ్లపల్లి తండాలో మాలోతు బాలు అనే రైతు కరెంట్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. అయితే అతడికి భూమి ఉన్నా.. సకాలంలో పట్టా అందలేదని రైతులు చెప్పారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న రైతు బీమా పథకం డబ్బులు రాకపోవడంతో గ్రామ రైతులు స్థానిక శివ్వం పేట తహాశీల్దారు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రైతుల ముందు నుండి వారిని పట్టించుకోకుండా తహాసీల్దారు భానుప్రకాశ్ వెళుతుండడంతో ఓ రైతు ఆయనపై డీజిల్ పోశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడి నుంచి ఎమ్మార్వోను తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌ విజయారెడ్డిపై దుండగులు పెట్రోల్ పోసి దారుణంగా సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ పేలుడు మూలాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement