Sunday, October 27, 2024

Siddipet: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు.. 21కేసులు నమోదు.. సీపీ శ్వేత

సిద్దిపేట్ : సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం 21 కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… గత కొన్ని రోజుల నుండి కొంతమంది యువకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ విద్వేషాలు పెంపొందించే విధంగా ఫోటోలు మార్పింగ్ చేసి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో IT చట్ట ప్రకారం 21 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకొని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ 8712667100 కు తెలియజేయాలని, ఆ సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా యువత వారి బావి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement