పటాన్ చెరు : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నోవాపాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 8వ తేదీ నుండి నియోజకవర్గ వ్యాప్తంగా వజ్రోత్సవాల సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 75 సంవత్సరాల వజ్రోత్సవాల సంబరాలను భవిష్యత్ తరాలకు తెలియచెప్పేలా పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జాతీయ రహదారి పక్కన 150 అడుగుల జాతీయ జెండాతో పాటు పైలాన్ నిర్మిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవాల సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హరితహారం లో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్, వివిధ శాఖల, అధికారులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement