పాపన్నపేట : మండల పరిధిలోని మిన్పూర్, కుర్తివాడ గ్రామాలలోని వరిపంటను జోగిపేట ఏరువాక శాస్త్రవేత్త రాహుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాల్లో వరి పొలాల్లో మెడ విరుపు మొగి పురుగు సుడి దోమ కంకినల్లి గుర్తించినట్లు తెలిపారు. పొలంలో సుడి దోమ కనిపిస్తే డైనో టేప్యూరన్ రసాయనిక మందు ఎకరానికి 100 గ్రాముల చొప్పున, లేదా పై మెట్రో జీన్ ఎకరానికి 120 గ్రాములు పిచికారి చేయాల్సిందిగా ఆయన సూచించారు. అదేవిధంగా ఇతరత్రా రోగాలు కనిపిస్తే స్థానిక వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించవలసినదిగా ఆయన సూచించారు. ఆయన వెంట పాపన్నపేట వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్‌కుమార్, ఏఈవో రజిత, మిన్‌పూర్ సర్పంచ్ లింగారెడ్డి, ఆ గ్రామ నాయకుడు బార్ పటేల్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement