Tuesday, November 19, 2024

సునీల్‌నాయక్‌ది ముమ్మటికి ప్రభుత్వ హత్యే..

మెదక్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికి ఒక నోటిపికేషన్‌ కూడా వేయకపోవడంతో కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సునీల్‌నాయక్‌ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని ఎస్సీ సెల్‌ జిల్లా నాయకులు ఏర్పుల బాబు అన్నారు. ఆయన మంబోజిపల్లిలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియమాకాలు కోసం తెలంగాణ ఉధ్యమం నిర్వహించి రాష్ట్రం సాధించుకుంటే నేడు ఉద్యోగాలు రాకపోవడంతో చాలా మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దౌర్భగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. ఇప్పటికైన సునీల్‌నాయక్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్‌ నేడు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement