చేగుంట : కరోనా వ్యాధి సోకి చేగుంటకు చెందిన వ్యాపారి ఎర్రమల్లి అంజయ్య (80) మృతి చెందారు. చందంపేట వాస్తవ్యులు, చేగుంట నివాసి వ్యాపారవేత్త ఎర్రమల్లి అంజయ్య నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికాగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎర్రమల్లి అంజయ్య రైస్‌మిల్ వ్యాపారంలో మక్కల సిండికేట్, ధాన్యం కొనుగోలు వ్యాపారాల్లో పనిచేశారు. ఆయన కుమారుడు ఎర్రమల్లి నాగరాజు వాసవిక్లబ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలందిస్తున్నారు.
కరోనాతో వ్యాపారి మృతి..
Advertisement
తాజా వార్తలు
Advertisement