గుమ్మడిదల : మండలంలోని దోమడుగు గ్రామంలో దుర్గామాత ఆలయం ఐదవ వార్షికోత్సవాన్ని ఆ గ్రామ ప్రజలు కోవిడ్ నిబంధనల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ పరిసర ప్రాంతాలలో గ్రామ పంచాయితీ సిబ్బందితో గ్రామ సర్పంచ్ అభిశెట్టి రాజశేఖర్ పాలకవర్గ బృందంతో కలిసి పంచాయితీ సిబ్బందితో శానిటేషన్ చేయించారు. ఉదయాన్నే అమ్మవారి వద్దకు ఘటం ఊరేగింపుగా తీసుకువచ్చారు. రామ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మహిళలు ఒక్కొక్కరుగా బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ పాలకవర్గం సభ్యుల ప్రత్యేక చోరవతో ప్రతిఒక్కరు మాస్క్ ధరించి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి రాజశేఖర్, వార్డుసభ్యులు, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నవీన్, కిషోర్, బాలు, రామ్‌రెడ్డి, శేఖర్, గ్రామ పెద్దలు జైహింద్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, చింతల సత్యనారాయణ, కిషన్, గ్రామంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement