Saturday, November 23, 2024

అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళు..

దుబ్బాకటౌన్‌ :రామక్కపేట గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద ప్రజల కోసం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కోసం కావలసిన స్థలం స్థానికి ప్రజా ప్రతినిధులు చూపితే అక్కడ ఇండ్లు నిర్మిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు తెలిపారు. మండలంలోని రామక్కపేట గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు పర్యటించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పెద్దలు, ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. అంతే కాకుండా మా గ్రామంలో అనేక మంది పేద ప్రజలకు ఇండ్లు లేవని ఇప్పటి వరకు గ్రామంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించలేదని మా గ్రామంలో ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పథకాన్ని మీ రామక్కపేటలో కూడా ప్రవేశపెడతామన్నారు. గ్రామంలో వంద డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మాస్తామని ప్రజలకు హామి ఇచ్చారు. ఇండ్ల నిర్మాణం కోసం కావలసిన అనువైన స్థలంను గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు చూపించాలని వారిని కోరారు. స్థలం చూపిన వెంటనే అక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మాణం చేపడుతామన్నారు. ఇండ్లు లేని ప్రజలకు తప్పకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. స్థలం చూపడమే ఆలస్యమని అది మీ మీద ఆధారపడి ఉందన్నారు. ఇంతకు ముందు సర్పంచ్‌, ఎంపిటీసి సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని, అంతే కాకుండా ఎస్సీ కమ్యూనిటీ భవనం, బీసీ ముదిరాజ్‌ కమ్యూనిటీ భవనం, గౌడ్‌ కులస్థులకు కమ్యూనిటీ భవనం, మున్నూరు కాపు కమ్యూనిటీ భవనం, పద్మశాలి కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారని అన్నారు. తప్పకూండా నిధులు ఇస్తామని అంచల వారిగా వాటిని నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామన్నారు. గ్రామంలో నెల కొన్న సమస్యల ను కూడా పరిష్కరిస్తామని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. రామక్కపేట గ్రామం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ నుండి ఇండ్ల నిర్మాణంకు కావలసిన స్థలం పాలక వర్గం ఎప్పుడు చూపితే అప్పడే డబుల్‌ ఇండ్ల నిర్మాణంకు శ్రీకారం చుడుతామన్నారు. ఎమ్మెల్యే చెప్పిన వెంటనే స్పందించిన ప్రజా ప్రతినిధలు మా గ్రామంలో ఇండ్ల నిర్మాణం కోసం కావలసిన స్థలంను త్వరలోనే చూసి మీ దృష్టికి తీసుకస్తామని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్‌ చింతల పద్మ ప్రభాకర్‌, ఎంపిటీసి సభ్యురాలు సంగం శోభ స్వామి, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement