ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమితమైన మోకాలి చిప్పలు మార్పిడిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామన్నారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు భయం పోయి దైర్యం, నమ్మకం కలిగిందన్నారు. డబ్బులున్నవాళ్ళకి మాత్రమే చేసుకునే మోకాలి చిప్పలు మార్పిడి నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలు అవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ కలలు నేడు నిజమవుతున్నాయన్నారు. ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 30శాతం డెలివరీలు అయితే నేడు 56శాతం అవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే సర్జరీలు సాధ్యమవుతున్నాయన్నారు. సుమారు ఈ సర్జరీలకు 5లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. సర్జరీ చేయడం వల్ల వారికి పునర్ జన్మ ఇచ్చామన్నారు. మోకాళ్ల నొప్పులతో ప్రతి 10మందిలో ఇద్దరు బాధపడుతున్నారన్నారు. ఈ ఆసుపత్రిలో వారానికి సుమారు ఆరుగురికి మోకాళ్ల చిప్పలు మార్పిడి చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement