జిల్లా వైద్యాధికారి, గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యునిగా విధులు నిర్వర్థిస్తున్న డా.తడకమడ్ల మహేష్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… డా.మహేష్ మంచి సేవాతత్పరుడు, మృదు స్వభావి, జిల్లా వైద్యాధికారిగా ఆయన సేవలు మరువలేనివన్నారు. వైద్య వృత్తిని సామాజిక సేవగా భావించారన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో జిల్లాలో మంచి వైద్యాధికారిగా పేరు తెచ్చుకున్నారని, వారి కుటుంబం ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవలో భాగస్వామ్యమవుతాన్నారు. అదే బాటలో ఒక వైద్యాధికారిగా, ఆర్థోపెడిక్ డాక్టర్ గా తన వృత్తి ధర్మాన్ని కాపాడుతూ ఎన్నో సేవలు చేశారని.. ఆయన సేవలను కొనియాడారు. జిల్లా ఒక మంచి డాక్టర్ ని, వైద్యాధికారుణ్ణి కోల్పోయిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement