టీఆర్ఎస్ మాజీ నేత..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమని అధికారులు నిర్ణయించారు. జమున హ్యాచరీస్ సంస్థ కబ్జాకు గురైన సర్వే నెంబర్లు ఇవే.. 77 సర్వే నెంబర్ లో 7 ఎకరాలు, 78 సర్వే నెంబర్ లో 13 ఎకరాల రెండు గుంటలు, 79 సర్వే నెంబర్ లో 11 ఎకరాల మూడు గుంటలు, 80 సర్వే నెంబర్ లో 16 ఎకరాల 26 గుంటలు, 81 సర్వే నెంబర్ లో 10 ఎకరాల 30 గుంటలు, 82 సర్వే నెంబర్ లో 10 ఎకరాల 9 గుంటలు, 130 సర్వే నెంబర్ లో 15 ఎకరాల 29 గుంటలు, 97 సర్వే నెంబర్ లో ఎకరా భూమి కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది.
అయితే 79 సర్వే నెంబర్ కి సంబంధించిన 9 మంది రైతులకు (11 ఎకరాల మూడు గుంటల) పట్టాలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. మొత్తం భూమి 85 ఎకరాల 19 గుంటలు 65 మంది రైతులకు సాయంత్రం వరకు పట్టాల పంపిణీ పూర్తిచేయడం జరుగుతుందని తూప్రాన్ ఆర్ డి ఓ శ్యాంప్రకాష్ తెలిపారు.