కౌడిపల్లి మండల పరిధిలోని దేవులపల్లి గ్రామానికి చెందిన చాకలి నాగరాజు (35) సోమవారం గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళాడు. పని చేస్తున్న క్రమంలో చాతిలో నొప్పి వస్తుందని తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే హుటాహుటినా ఆటోలో కౌడిపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.