Saturday, November 23, 2024

సజావుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ..

చేగుంట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై రైతులు మక్కువ చూపుతున్నారు. సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయంలో ఏర్పడిన దళారీ వ్యవస్థను రూపుమాపడానికి తహశీల్దార్‌ కార్యాలయంలో జాయింట్‌ సబ్‌రిజిష్టార్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో రైతులు నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. చేగుంట తహశీల్దార్‌ కార్యాలయంలో 11 మంది చిన్నకారు, సన్నకారు రైతులు భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. అందులో చేగుంట ఒకటి, ఉల్లితిమ్మాయిపల్లి 4, కంసాన్‌పల్లి 2, ఇబ్రహీంపూర్‌ 1, బోనాల 1, కొండాపూర్‌ 1, అనంతసాగర్‌ 1 రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాయి. ఈ విషయమై చేగుంట తహశీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి మాట్లాడుతూ 2020-21 నాటి నుండి నేటికి 420 రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి రిజిస్ట్రేషన్లపై రైతులు శ్రద్ద చూపుతున్నారని, సకాలంలో రిజిస్ట్రేషన్‌లు పూర్తవుతున్నాయని అన్నారు. అరగంట సమయంలోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి తక్కువ సమయంలోనే మోటివేషన్‌ అమలు చేస్తున్నామని, అలాగే పౌతి విరాసత్‌ చేయడం జరుగుతుందన్నారు. దానపత్ర రిజిస్ట్రేషన్లు సైతం ఎక్కువగా చేసుకుంటున్నారని తహశీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement