Friday, November 22, 2024

అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు : గత ప్రభుత్వాల హయాంలో నిరాదారణకు గురైన పల్లెలు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, నందిగామ, ఘనాపూర్, భానూరు, క్యాసారం, ఇస్నాపూర్, పాశమైలారం గ్రామాల పరిధిలో రూ.రెండు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, మహిళా సమాఖ్య భవనం తదితర పనులకు స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి శంకుస్థాపన చేశారు. క‌ర్ధనూరు, నందిగామ, భానూరు, ఇస్నాపూర్ గ్రామాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హాయంలో లక్ష రూపాయల నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని, నేడు ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, రాజకీయాలకు అతీతంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నిరుపేద ప్రజల కోసం వైకుంఠ రథాలు, ఫ్రీజర్ బాక్స్ లు అందించిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తి మరణించినప్పుడు అంతక్రియలు ఇబ్బంది కాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు నిర్మించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement